కృష్ణపట్నంలో భారీగా పోలీసుల మొహరింపు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం 9:30గంటలకు ముట్టడించనున్నట్లు మత్య్సకారులు ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ భారీగా పోలీసులను మొహరించారు. అక్కడంతటా 144సెక్షణ్‌ విధించారు. పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలు పోర్టును ముట్టడించనున్నారు. తమకు ఉపాధితో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, మత్య్సకారులకోసం షప్పింగ్‌హార్భర్‌ నిర్మించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.