కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు స్టే

సాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకంటే తక్కువ
ఉంటే నీటిని విడుదల చేయవొద్దని మద్యంతర ఉత్తర్వు
నీటి పారుదల శాఖకు నోటీసు
హైదరాబాద్‌, జూలై 16 : నాగార్జునసాగర నుంచి కృష్ణాజిల్లాడెల్టా రైతాంగానికి వ్యవసాయ అవసరాల కోసం నీటి విడుదల పై హైకోర్టు స్టే విధించింది. సాగర్‌ నీటి మట్టం 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీటి విడుదలను నివిపివేయాలని కోర్టు మధ్యంతర ఉద్దర్వులు ఇచ్చింది. దీని పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని , నీటి పారుదల శాఖను హైరకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణకు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. నాగార్జునాసాగర్‌ లో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ చేరినప్పటికి ప్రభుత్వ కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పై రిటైడ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటరెడ్డి హైరోక్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణకు స్వికరించింది. డెల్టా రైతులకు సాగర్‌ నుంచి నీరు విడుదల చేయాలని, ఎటువంటి అధికారిగా ఉత్తర్వులు లేక పోయినప్పటికి సాగర్‌ ఓ నీటి మట్టం తక్కువ ఉన్నప్పటికి ప్రభుత్వం ఆంధ్రా ప్రాంతానికి లబ్ది జరిగేలా నీరు విడుదల చేస్తోందని, దీని వల్ల తెలంగాణ జిల్లాలకు మంచినీటి సమస్య వస్తుందని పిటిషనర్‌ పిల్‌ లో కోరారు. సాగర్‌ కింద రైతాంగానికి మేలు జరగకుండా కృష్ణా డెల్టాలో రైతుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీపసుకునేందని వెంకట రెడ్డి తన పిటిషన్‌లో కోరారు తీని పై విచారణ చేపట్టిన కోర్టు నీటి మట్టం 510 అడుగుల కంటే తక్కువుంటే నీరు విడుదల చేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీని పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కృష్ణా డెల్టాలో వరాషభావ పరిస్థితుల వల్ల నారుమళ్ల కోసం నీటిని విడుదల చేయాలని ఆంధ్రా ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రిని కోరారు. దీని పై ఇరిగేషన్‌ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వారం రోజుల పాటు కృష్ణా డెల్టాకు సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. అధికారులు కూడా విడుదలకు అభ్యంతరం చెప్పక పోవడంతో సీ.ఎం ఈ నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సాగర్‌ నుంచి కృష్ణడెల్టాకు అధికారులు నీటిని వదిలారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై టీఆర్‌ఎస్‌ పార్టీతో జహ తెలంగాణ మేధావులు, కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సాగర్‌లో నీటి మట్టం డెడ్‌ స్టోరేజ్‌కి చేరిందని, ఇటువంటి సమయంలో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తే భవిష్యత్తులో వరన్షాలు వెనక్కి పోతే హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు మంచి నీటి సమస్య వస్తుందని వారు ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని వారు సూచించారు. కాంగ్రెస& ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తో సహపలువురు మంత్రులు మాత్రం సాగర్‌ నుండి నీటి విడుదల వల్ల మంచినీటి సమస్య రాదని , కృష్ణా డెల్టాకు నీటి విడుదలను రాజకీయం చేయవద్దన్నారు. అయితే గత వారం రోజులుగా కృష్ణా డెల్టా ఎడువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడటంతో సాగర్‌ నీటి విడుదలను ఆపి వేశారు. గేట్టను మూసి వేశారు. ప్రస్తుతం కృష్ణాడెల్లా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయని అందెవల్లన నీటి విడుదలను నిలిపి వేసుస్తున్నట్లు అధికారులు గత శుక్రవారం ప్రకటించారు. తదుపరి పరిస్థితిని సమీక్షించి. నీరు విడుదల పై నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారుల పేర్కొన్నారు.