కృష్ణా డెల్టాలో పంటను కాపాడేందుకు చర్యలు: లగడపాటి

విజయవాడ: కృష్ణా డెల్టాలో పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. దీంతో ఈ ఏడాది తప్పకుండా అత్యధిక దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాగర్‌నుంచి నీటి విడుదతకు ఆటంకంగా ఉన్న జీఓను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.