కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందిః విహెచ్‌

హైదరాబాద్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ఎన్నికలు దగ్గర పడుతుంటే సిఎం కెసిఆర్‌కు ఇప్పుడు బీసీలు గుర్తొస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీహెచ్‌ విమర్శించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…బీసీల పట్ల సీఎం కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 మంది బీసీలు ఉండాల్సిన కేసీఆర్‌ కేబినెట్‌లో నలుగురే ఉన్నారన్నారు. ఏపీ ప్రత్యేక ¬దాకు అడ్డుపడ్డ కేసీఆర్‌కు తెలంగాణలో ఉన్న ఆంధ్రులు బుద్ధి చెప్పాలన్నారు. టిఆర్‌ఎస్‌ బిజెపితో అంటకాగుతోందని పేర్కొన్నారు.తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు బూతు సాహితీ అవార్డులివ్వాలని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌ కంటే పవన్‌కల్యాణ్‌కు ఎక్కువ అనుభవం ఉందా? అని ప్రశ్నించారు. మోదీ మాదిరిగా కాంగ్రెస్‌ మాట తప్పే పార్టీ కాదన్నారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వీహెచ్‌ చెప్పారు.