కెసిఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత
హైదరాబాద్,ఆగస్ట్6(జనం సాక్షి ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అక్కడ్నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనను రద్దు చేసుకున్నారు. యశోదా ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. లీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి లీలమ్మ భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. ఆమెకు నివాళి అర్పించేందుకు బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు.



