కెసిఆర్ సొమ్ము ,కాదు రాష్ట్ర ప్రజల ఖజన
కెసిఆర్ కుటుంబ నియంత్రణ అగాలి *
అనర్తులకు కేసీఆర్ పెన్షన్లు
గద్వాల ఆర్ సి (జనం సాక్షి.)సెప్టెంబర్ 1 ,
గద్వాల పట్టణంలోని విలేకరుల సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు చనిపోతే ట్విట్టర్ పిట్ట కు కనిపించడం లేదా అని
దీనికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని,ఆ కుటుంబాల బాధ్యత, పిల్లల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.జిల్లాలో మంజూరైన పెన్షన్లలో 40%అనర్హులను ఎంపిక చేసారు.ప్రొసీడింగ్ కాగితాలు కాదు లబ్ధిదారుల వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆసరా పింఛన్లు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఆసరా కాదు కెసిఆర్ సొమ్ము కాదు ,రాష్ట్ర ఖజానా అది ప్రజల సొమ్ము నీ కార్యకర్తలకు నీ సొంత డబ్బు ఇవ్వు తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెర వేరలేదు.హామీ ఇచ్చిన నాటి నుండి అర్హులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలి.ఎలక్షన్లు రాగానే కెసిఆర్ కు పింఛన్లు గుర్తు కొస్తాయి.మునుగోడులో లబ్ది పొందేందుకు పెన్షన్ ల హామీని ప్రకటించాడు.జిల్లాలో 16,123 వితంతు పెన్సన్స్ మంజూరు అయినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో అర్హులైన లబ్ధిదారులను కాకుండా 40 శాతం వరకు అనర్హులను ఎంపిక చేశారు.
టిఆర్ఎస్ అనుకూల ను ఎంపిక చేశారు.జిల్లా కలెక్టర్ పెన్షన్ లపై విచారణ జరపాలి.
కేసీర్ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను పరామర్శించిఆర్థిక సహాయం చేయకుండా కేవలం రాజకీయ లబ్దికోసం ఇతర రాష్ట్రాలలో ఆర్థిక సహాయం చేస్తున్నాడు.
తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చి ఉద్యోగులకు,పెన్షన్ దారులకు,మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చింది లేదు.అబద్దాల ప్రకటనలు,కాలేశ్వరం ,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కోట్లు దోచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, ధరూర్ మండల అధ్యక్షుడు రాజేష్ అయ్యా, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు ఎం కె ప్రవీణ్, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.