కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నిర్ణయంపై పునరాలోచన : డీఎంకే

చెన్నై : శ్రీలంకలో తమిళుల హక్కులపై కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకుంది. శ్రీలంకకు వ్యతిరేకంగా కేంద్రం రెండ్రోజుల్లో సానుకూలంగా ప్రతిస్పందిస్తే తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని ఆ పార్టీ అధినేత కరుణానిధి తెలిపారు. ఈ నెల 21లోగా శ్రీలంకకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ తీర్మానం ఆమోదించాలని కోరారు. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్‌ ఓటేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.