కేంద్రమంత్రి జైరాం వ్యాఖ్యాలపై స్వరూపానంద ఫైర్‌

విశాఖపట్నం:’ దేశంలో మరుగుదొడ్ల కన్నా ఆలయాలే ఎక్కువగా ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖాలపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కయ్యపాలెంలో మహా అన్న సమారాధనలో స్వరూపానంద పాల్గొన్నారు. రాజకీయ నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, దైవభక్తికన్నా డబ్బుపైనే వారికి ఆసక్తి, మమకారం ఉందని విమర్శించారు.