కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వల్సిందే: సురవరం

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెంగాణ ఇచ్చి తీరాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఈరోజు తెరాస అధినేత కేసీఆర్‌ సురవరంతో భేటీ అయ్యారు. అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాధన దిశగా చర్చలు సబబేనని పైరవీలు సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇవ్వడం రాజకీయ అవసరమని పేర్కొన్నారు.