కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నేతలు
దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మండల కేంద్రం లోని ఖమ్మం జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము, మండల రైతు కోఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెండ్యాల నరేష్ ,తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్ కుమార్, రామానుజపురం సర్పంచ్ ధర్మారపు నాగయ్య, కుమ్మరి కుంట్ల ఎంపిటిసి దుబ్బాకుల వెంకన్న, నాయకులు కడుదుల మధుకర్ రెడ్డి,నాగిరెడ్డి వెంకట్ రెడ్డి దుండి వెంకటేశ్వర్లు, అంకం సోమేశ్వర్,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.