కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిపై వేటు
న్యూడిల్లీ: అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి ఎ.కృష్ణమూర్తిని సస్పెండ్ చేసినట్లు అకాడమీ చైర్మన్ సునీల్ గంగోపాధ్యాయ పేర్కోన్నారు. నలుగురు సభ్యులతో కూడిన అకాడమీ కార్యనిర్వాహక బోర్డు ఈ మేరకు శుక్రవారమే నిర్ణయం తీసుకున్నట్లు కోల్‌కతా నుంచి ఆయన ఫోన్‌లో ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఆర్థిక అవకతవకలతోపాటు పాలనాపరమైన ఆరోపణలు కూడా కృష్ణమూర్తిపై వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని గంగోపాద్యాయ వివరించారు.