కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కలిసిన బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను రాజ్‌ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం కలిశారు. నిన్న రాత్రి రాజధానికి వచ్చిన షిండేను గవర్నర్‌, సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.