కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలి

 : నక్క విజయ్కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలి : నక్క విజయ్ధర్మపురి 27 మార్చి (జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ ఆదేశం మేరకు బహుజన సమాజ్ పార్టీ ధర్మపురి శాఖ అధ్యర్యంలో రిలే నిరాహార దీక్షను చేపట్టినట్లు నియోజకవర్గ ఇంచార్జ్ నక్క విజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం  నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని అన్నారు. కేటీఆర్ ను భర్తరఫ్ చేసి, టీఎస్ పీఎస్ సి ఘటన పై సిట్టింగ్ జడ్జి తో సిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.గ్రూప్ వన్ అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.తెలంగాణ తెచ్చుకోవడానికి ఎక్కడైతే ఉద్యమం చేశామో అక్కడి నుండే మళ్ళి విద్యార్థులు కేసీఆర్ ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని లీకేజి విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్ష ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు తెలంగాణ ప్రజానికానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుండి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని అందులో భాగంగానే నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఇచ్చిన నోటిఫికేషనలపై కోర్టుకు వెళ్ళి స్టే లు తేవడం మరియు ప్రశ్నాపత్రాలు లీకులు మొదలగునవి నిరుద్యోగుల పట్ల శాపంగా మారాయని అన్నారు.తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్యపు విధానాలు నిరుద్యోగుల ఆత్మహత్యలను  ప్రేరేపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిర్మూలన అంటూనే మరోపక్క ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్లు పెంచి నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం  ఆటలాడుకుంటుందని అన్నారు. ఉపాధి హామీలో పని చేసే క్షేత్ర సహాయకులను 12,000 మందిని తొలగించి రెండేళ్ల పాటు వాళ్ళ జీవితాలను రోడ్డుపాలు చేసిందని అంతే కాకుండా ముఖ్యమైన రెవెన్యూ శాఖను పెద్దల పాలు చేయడానికి వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి మిగతా శాఖలో విలీనం చేసి నిరుద్యోగుల్లో నిరాశ నింపింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అందుకే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దీక్షకు మద్దతు కు అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్, అధ్యక్షుడు గొడుగు ప్రశాంత్, ఉపాధ్యక్షుడు బచ్చల స్వామి, మహిళ అధ్యక్షురాలు ముంజ లలిత గౌడ్, ప్రధాన కార్యదర్శి నక్క గంగాధర్, సోషల్ మీడియా అధ్యక్షుడు మద్దెల శంకర్, బుగ్గారం మండల అధ్యక్షుడు గజ్జెల స్వామి, పెగడపెల్లి అధ్యక్షుడు గొడుగు నరేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అజయ్,వెంకటేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు