కేర్‌ సెంటర్‌ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌:ఎల్‌బీనగరలోని పిల్లల సంరక్షణ కేంద్రంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది.చపాతి తినిసిస్తుండగా గొంతుకు అడ్డంపడి చిన్నారి అన్విత మరణించింది.చైతన్యపురి ఆర్కేపురానికి చెందిన రజని,లవకుమార్‌ దంపతులకు అన్విత ఏకైక సంతానం ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పాపను లక్ష్మీ బేబీ కేర్‌ సెంటర్‌కు పంపిస్తున్నారు.ఉదయం తల్లిదండ్రులు ఆమెను కేర్‌ సెంటర్ల్‌ వదిలి వెళ్లిన కాసూపటికే ఈ దారుణం జరిగింది సిబ్బంది చపాతీ తినిపిస్తుండగా గొంతులో ఇరుక్కుని పాప ఉక్కిరిబిక్కిరైందని అపస్మారకస్థితిలోకి చేరుకున్న చిన్నారిని నిర్వాహకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని తెలిసింది.ఈ దుర్ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు,బందువులు కేర్‌ సెంటర్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం పట్ల నిరసన వ్యక్తం చేశారు.బాధ్యులను వెంటనే అరెస్టు చేమాలని డిమాండ్‌ చేశారు.