కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికి ఆదర్శం

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికి ఆదర్శం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 21( జనం సాక్షి)సెప్టెంబర్ 21 : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గురువారం వరంగల్ శివనగర్ పోపా కార్యాలయంలో రాష్ట్ర పోపా అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ తొలి తరం పోరాట యోధుడు , తుది శ్వాస వరకు తెలంగాణకై పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్మరించుకోవడం తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమేనని అన్నారు . నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించారని అన్నారు . అనేక సందర్భాలలో వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ , బాపూజీ ఆశయాలను కొనసాగించాలని కోరుతూ నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పోపా జిల్లా నాయకులు మాటేటి అశోక్, సింగం కుమార్, భిక్షపతి, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, శామంతుల కిరణ్, వంగరి సతీష్, కండకట్ల గణేష్ బాబు,పెద్దూరి పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.