కొడప్ గల్ ఎస్సై గా కోనారెడ్డి

జుక్కల్, మార్చి 4,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ ఎస్సై గా శుక్రవారం రాత్రి కోనా రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై విజయ్ కొండ బదిలీపై పిట్లంపోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి వి ఆర్ లో ఎస్సై గా పనిచేసిన కోనా రెడ్డి పెద్ద కొడప్ గల్ వచ్చారు. కామారెడ్డి హైవే పై ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం, వస్త్రాలు అందించి కోనారెడ్డి ప్రశంసలందుకున్నారు. ఈయన సేవలు గుర్తించిన కామారెడ్డి ఎస్పి ప్రశంసా పత్రం అందించి సన్మానించారు. గతంలో ఈయన పెద్ద కొడప్గల్ పోలీస్ స్టేషన్ లోకూడా ఏ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఇక్కడ కూడ అందరితో మమేకమై ఎన్నో సమస్యలను పరిష్కరించారు.