కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టుల మంజూరు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. గుంటూరు జిల్లా గణపవరం, శ్రీకాకుళం జిల్లా పైడిభీమావరంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోచోట ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌నర్స్, ఇతర సిబ్బందిని నియమించడానికి అనుమతి లభించింది. పైడిభీమవరంలో 15,గణపురంలో 16పోస్టులను శాశ్వత ప్రాతిపదికను భర్తీ చేస్తారు. మరోవైపు, రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్తగా 13మంది ఉద్యోగులను డిప్యూటేషన్ లేదా పొరుగుసేవల విధానంలో నియమించడానికి కూడా ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.