కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్లపై ఎలువంటి నిషేదం లేదు

న్యూఢిల్లీ: కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్ల జారీపై ఎటువంటి నిషేదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను నివారించేందుకు కొత్త కనెక్షన్ల జారీని మూడు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసనట్టు పేర్కొంది. ఒకే ఇంటిలో ఉండే బహుళ గ్యాస్‌ కనెక్షన్లను రద్దు చేసేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. వినియోగదాదుడు గ్యాస్‌ కనేక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గ్యాస్‌ పంపిణీ ఏజెన్సీలు దాన్ని పరిశీలిస్తాయి. అనంతరం గ్యాస్‌ కనెక్షన్‌ను కేటాయిసుత్న్నట్టుగా అతనికి సమాచారం పంపిస్తాయి. ఏడాదికి రాయితీపై అందించే సిలిండర్లను ప్రభుత్వం ఆరుకు కుదించిన నేపథ్యంలో ఇది ఆవశ్యకమైంది. ఇందుకోసం కనీసం మూడు వారాల సమయం పడుతుంది. మరోపక్క ఒకే ఇంట్లో ఒకటికి మించి ఉండే కనెక్షన్లను సంస్థలు రద్దు చేస్తున్నాయి. ఈ నెపథ్యంలో కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు లేఖలను అవి జారీ చేయడంలేదు అని సదరు అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా కొత్త ఎల్పీజీ కనెక్షన్ల మంజూరుపై ఎటువంటి నిషేదం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.