కొనసాగుతున్న గుంటూరు జిల్లా బంద్‌

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలో తెదేపా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతొంది. గుంటూరు, నగరంలో పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతంలో దుకాణాలను మూసివేయించారు. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పేట వద్ద చీరాల ప్రధాన రహదారిపై కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. సహకార ఎన్నికల ఓట్ల నమోదులో అక్రమాలు తొలగించాలని నిన్న ఆందోళనకు దిగిన కోడెల సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.