కొనసాగుతున్న పర్యాటకశాఖ కార్మికుల సమ్మె

విశాఖ: పర్యాటక శాఖ ఒప్పంద కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగుతుంది. అరకు, అనంతగిరి, బొర్రా,టైడాలో పర్యాటక శాఖ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బొర్రా గుహలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు.  సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని పర్యాటక శాఖ సిబ్బంది హెచ్చరించింది.