కొమ్ములవంచకు చేరుకున్న బాబు పాదయాత్ర

కొమ్ములవంచ: చంద్రబాబు వసున్నా.. మీకోసం పదయాత్ర డోర్నకల్‌ నియోజ కవర్గం నరసింహుల పేట మండలంలో కొమ్ములవంచ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మొదట ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెదేపాకు ఈ గ్రామం కంచుకోటలాంటిదన్నారు. ఇది అవినితి ప్రభుత్వమని, పేదలను దోచుకునేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల కష్ఠాన్ని, చెమటను దోచుకుంటూ కింగ్రెస్‌ ప్రభుత్వం పందికొక్కులా పెరిగిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఒక్క కొత్త గ్యాస్‌ సిలిండర్‌ కన్షెనూ ఇవ్వలేదాని, ఉన్న సిలిండర్‌ కే ధరను పెంచిందన్నారు. నిత్యావసర వస్తువులు, ఆర్టీసీ రేట్లు పెంచిందన్నారు. తెదేపా ఆధికారంలోకి వస్తే ప్రజలందరికీ శుభ్రమైన తాగునీరు అందిస్తామన్నారు. ముసలి వారికి, వితంతువులకు రూ. 600 పింఛను ఇస్తామన్నారు. పేదవారందరికీ లక్ష రూపాయలు ఖర్చుపెట్టి సోంతిళ్లు కట్టిస్తామన్నారు. బీసీల కోసం వంద అ సెంబ్లీ సీల్లు ఇస్తామని, స్థానిక సంస్తల్లో 50 సీట్లు ఇస్తామని వారకి ఆర్థికంగా అభివృద్ది చేస్థామన్నారు. 500 జనాభా ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తిస్తామన్నారు. గిరిజనులకు పింఛనిచ్చే బాధ్యత తెదేపాదన్నారు. గిరిజన పిల్లలందరికీ ఉచిత విద్య అందిస్తామన్నారు.