కొల్హాపూర్‌లో సీపీఐ నాయకుడు పన్సారేపై కాల్పులు

హైదరాబాద్‌: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సీపీఐ నాయకుడు గోవిందరావు పన్సారేపై కాల్పులు జరిగాయి. టోల్‌గేట్ల వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న పన్సారేపై గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఉదయం కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవిందరావు పన్సారే పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం.