కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాంపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 153, 153(ఏ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.