కోదండరాం అరెస్ట్‌ను ఖండించిన నాగం

హైదరాబాద్‌: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ హౌస్‌ అరెస్ట్‌ను నాగం జనార్థన్‌రెడ్డి ఖండించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాయొద్దని ఆయన అన్నారరు. వెంటనే కోదండరామ్‌ను విడుదల చేయాలని నాగం డిమాండ్‌ వ్యక్తం చేశారు.