కోదండరాం ఇంటి ముట్టడి

హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబుపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ యువజన విద్యార్థి నాయకులు ఈరోజు సాయంత్రం ఆయన ఇంటిని ముట్టడించారు. కరీంనగర్‌ కవాతులో తెలంగాణ వ్యతిరేకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యతారహితంగా వ్యాఖ్యానించిన కోదండరాం ఐకాస ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.