కోర్టుకు హాజరుకాని మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు మంత్రి ధర్మాన ప్రసాదరరావు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో ఆయన ఇవాళ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది, అయితే తన తల్లి మరణించినందున తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆయన కోర్టులో డిస్పెన్స్‌ పిటిషన్‌ వేశారు. మంత్రి పిటిషన్‌ను న్యాయమూర్తి మన్నించి అనుమతించారు. నిందితుడు వచ్చే వాయిదాకు హాజరుకావాలని మంత్రి తరపు న్యాయవాదికి సూచించారు.