కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం : ఏడుగురు మృతి
కోల్‌కతా : కోల్‌కతాలోని సూర్యసేన్ మార్కెట్‌లోని ఓ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు పరిస్తితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువమంది నిద్రలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.