కోస్తా ఆంధ్రాలో వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌ : వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్న కారణంగా రాబోయే 48 గంటల్లో కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఓ మోస్తరు తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. రాయలసీమ, తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ఇంకా బలపడితే మరింతగా వర్షాలు కురాసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. గడిచిన 24గంటల్లో కళింగపట్నంలో 5 సెం. మీ., యలమంచిలి, అనకాపల్లి, కందుకూరుల్లో 3 సెం. మీ. చొప్పున వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు.