క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌: డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దినేష్‌రెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి  గౌతంకుమార్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఉత్వర్వులు జారీ చేసింది.