క్రికెట్‌ ఆడినంత సులువు కాదు…వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం అంటే క్రికెట్‌ ఆడినంత సులువుకాదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు వేషం వేసినంతమాత్రాన వారి కష్టాలు తీరవని అన్నారు. మద్దతుధర, రైతులకు ఎరువులు అందేలా ముఖ్యమంత్రి చూడాలన్నారు. కరువు ప్రాంతాలను సందర్శించకుండా ముఖ్యమంత్రి కొంగజపం చేస్తున్నారని అన్నారు. కరువుప్రాంతాలపై నివేదిక ఇచ్చినా కేంద్రం నుంచి ఇంత వరకు స్పందన లేదని అన్నారు. రైతులు అప్పుల్లో కూరుకుపోయినాప్రభుత్వం ఆదుకోలేకపోతోందని అన్నారు.