క్లాక్‌టవర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ కవాతుకు మద్దతుగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ నుంచి కార్యకర్తలతో ఆమె ర్యాలీగా బయలుదేరారు. కవాతును అడ్డు కోవద్దని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇది శాంతియుతంగా జరిగే కవాతు అని అందరూ సహకరించాలని కోరారు.