క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజేందర్‌ సింగ్‌

లండన్‌: ఒలంపిక్‌ క్రీడల్లో పురుషుల మిడిల్‌వైయిట్‌ (75కేజీ) బాక్సింగ్‌ విభాగంలో ఇండియన్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు టెరెల్‌గౌషాతో జరిగిన మ్యాచ్‌లో 16-15తేడాతో విజయం సాధించాడు.