క్షమాపణ చెప్పకపోతే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం

ముస్తాబాద్ సెస్టంబర్ 19 జనం సాక్షి
చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్యల సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి నేత ప్రకాశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక సంఘాల ఐక్య కార్యాచరణ వేధిక ఆధ్వర్యంలో  రజకసంఘాల నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యత వహిస్తూ ప్రకాశ్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించాలని లేని ఎడల ఖచ్చితంగా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం అని పిలుపునిచ్చారు,రాష్ట్రంలోని రజక సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి రజకుల ఐక్యతను చాటడానికి త్వరలోనే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే తేదీ, సమయం,స్థలం,తెలియజేస్తామని ప్రతి ఒక్కరు ఒక   సైనికుడిలా తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, తెలంగాణరజక వృత్తిదారుల సంఘం ప్రధానకార్యదర్శి ఫైళ్ల ఆశయ్య,ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ,బొడ్డుపల్లి కృష్ణ  రాష్ట్ర కార్యదర్శి రజక వృత్తిదారుల సమాఖ్య,  గుమ్మడి రాజు నరేష్, రాష్ట్ర అధ్యక్షులు రజకవృత్తిదారుల సంఘం,పి.వెంకన్న, సకినాల రవి రజక సమితి రాష్ట్ర కార్యదర్శి, చాపర్తి కుమార్ గాడ్గే అధ్యక్షులు ,కోలిపాక మల్లెశం,రజక రిజర్వేషన్ పోరాట సమితి.గోపీ రజక రాష్ట్ర అధ్యక్షుడు రజక రిజర్వేషన్ సమితి, బాలాపూర్ బాలరాజు రజక చర్చా వేదిక, మొగ్గ  అనిల్ కుమార్ జాతీయ అధ్యక్షుడు అఖిలభారత రజక సంఘం, కార్యక్రమంలో ప్రజా సంఘాల, విద్యార్థి,యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Attachments area