ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కి సముచిత స్థానం కల్పించాలి

రఘునాథ పాలెం మార్చి20 (జనం సాక్షి) మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినారుఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి మండలంలో ప్రతి గ్రామం తిరిగి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేపించారు, అదే విధంగా రైతు రచ్చబండ, రైతు డిక్లరేషన్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంఘీ భవంగా మండలం మొత్తం పాదయాత్ర చేపట్టారు అని తెలిపారు అదే విధంగా మండలం నుంచి హైదరాబాద్ కు అనేక సందర్బంలో బస్సులను ఏర్పాటు చేసి వారిని వరంగల్ రైతు రచ్చబండ కార్యక్రమానికి తరలించారు అని ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలక పాత్ర పోషించారు అని ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవీలలో స్థానం కల్పించకపోవడం చాలా బాధాకరం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు కొంటెముక్కుల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిరిషాల చిన్న వెంకటేశ్వర్లు మారం కరుణాకర్ రెడ్డి, రఘునాథ పాలెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెంటాల ప్రసాద్ రామ్మూర్తి, బొడ తావుర్య నాయక్, షేక్ సిద్దయ్య, జోనాబోయిన పాపయ్య, చలమల రామారావు, ఘని పాషా,బన్సిలాల్, శ్యంలాల్, బోడా రవి, హరి సింగ్, అంగోత్ వెంకన్న, కృష్ణ ప్రసాద్, నవీన్ వెంకటనరసయ్య, కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు