ఖరీఫ్‌లో సాగు కష్టమే

న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో నిర్దేశించుకున్న ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఖరీఫ్‌లో విత్తునాటే సమయం దాదాపు పూర్తికావొచ్చింది. మరోపక్క వచ్చే నెల నుంచి పంటల కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంకో వారం రోజుల్లో ఖరీఫ్‌ ఆహారధాన్యాల మొదటి ముందస్తు అంచనాలను ఆహారశాఖ విడుదల చేయనుంది. 2012-13 పంట సంవత్సరానికి దేశంలో 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని వ్వవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించింది.