ఖైరతాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఈ రోజు సీఎం కిరణకుమార్‌రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇబ్బందులను అధికారులు పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. సీఎం వెంట మంత్రి దానం నాగేందర్‌ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.