ఖైరతాబాద్‌ ఆర్టీఏ ముందు ఆటో సంఘాల ధర్నా

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతినివ్వడంపై ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌ రవాణ శాఖ కార్యాలయం ముందు ఆటో యూనియన్‌ నేతలు ధర్నా చేపట్టారు. కొత్త ఆటోలకు అనుమతినిస్తు జారీ చేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.