గంజాయి స్థావరాలపై పోలీసుల దాడి.. 1650 కిలోల గంజాయి పట్టివేత

రోలుగుంట:విశాఖ జిల్లాలోని నర్సీపట్నం,మాకవరపాలెం,గొలుగొండ మండలాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించి 1650 కిలోల గంజాయిని పట్టుకున్నారు.దీని విలువ దాదపు రూ.50లక్షలుంటుందని అంచనా.దీంతో సంబందమున్న 10 మందిని అరెస్టు చేశారు.వీరితో పాటు ఒక వ్యాను,లారీ ఇండికా కారు,రెండు ద్వి చక్రవాహనాలు రూ.70వేల నగదును సాధీనం చేసుకున్నారు.ఈ గంజాయి వ్యాపారంలో ముంబయి మాఫియాకు సంబందాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని నర్సీపట్నం ఏఎస్పీ తప్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు.