గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి :
ఎల్బీ నగర్( జనం సాక్షి ) గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి అన్నారు . మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో నెలకొల్పిన మహా గణనాథుని మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి హాజరై ఆ మహా వియకునికి పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిచారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాత అయిన అనీష్ పాషా ని అభినందించారు. అన్నీ ధనలోకెల్లా అన్నదానం గొప్పదని తెలియజేశారు. నిర్వాహకులకు కొన్ని సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. వారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎసి సెల్ కన్వీనర్ బండి మధుసూధన్ రావు ఆర్కె పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, పెద్దవూర సైదులు యూత్ సభ్యులు బాలు యాదవ్, చిన్న, అనిల్, రాఘవేందర్, శివ, సాయి కృష్ణ, అయప్ప తదితరులు పాల్గొన్నారు.