గన్నవరం నుంచి ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట

విజయవాడ: ఈ నెల 25 నుంచి 27 వరకు కృష్ణా జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట నిర్వహించనున్నట్లు మంత్రి పార్ధసారథి ప్రకటించారు.  కృష్ణాజిల్లా గన్నవరం మండలం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట ప్రారంభిస్తారని మంత్రి తెలియజేశారు.