గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

గన్నవరం: పశ్చమగోదావరి జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం . 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయనతో పాటు మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పితాని సత్యనారాణ, సునీతా లక్ష్మారెడ్డి, ఆనవర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఉన్నారు. వీరికి  రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి, కృష్ణా జిల్లా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, జోగి రమేష్‌, దాసు, రామకోటయ్య, మల్లాది విష్ణు, ప్రభుత్వ వివ్‌ పేర్ని నాని తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాఫ్టర్‌లో మంత్రులతో కలిసి పోలవరం బయలుదేరి వెళ్లారు.