గన్నేరుకాయల తిని యువకుడి ఆత్మహత్యాయత్నం
విజయనగరం, ఆగస్టు 1 : గన్నేరు కాయలు తిని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుమ్మలక్షీపురం గ్రామానికి చెందిన బి.గోపాలం కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపునొప్పిని భరించలేక గన్నేరు కాయలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గుమ్మలక్షీపురం పిహెచ్‌సిలో ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన చికిత్స పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.