గల్లంతైన పడవ ఆచూకీ లభ్యం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద గల్లంతైన ఓ పడవ ఆచూకీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో లభ్యమైంది. మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరుకున్న ఓ మత్స్యకారుడు మెరైన్‌ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో పడవలో ఉన్న మిగిలిన ఆరుగురిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు పడవ  తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.