గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర నాయకత్వం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.