గాలి జనార్ధన్‌ బెయిల్‌ కేసులో కొత్త విషయాలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెయిల్‌ ఇప్పించేందుకు లక్ష్మీనరసింహరవు బంధువు రూ. 500కోట్లు అడిగినట్టు సీఏ కృష్ణప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నాంపల్లి న్యాయస్థానంలో నమోదు చేశాడు. గాలికి బెయిల్‌ కోసం హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసంహరావు బంధువు వెంకటేశ్వరరావును సంప్రదించగా ఒప్పందం విలువ రూ. 500 కోట్లు వుండాలని ఆయన కోరినట్టు ప్రాసాద్‌ పేర్కొన్నాడు. అయితే తాను అంత మొత్తం సరికాదని రూ 100 కోట్లు ఇవ్వాలని దశరధరామిరెడ్డికి చెప్పినట్టు వెల్లడించారు.