గాలి బెయిలు కుభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరపాలి: వర్ల

గుడివాడ: గాలిజనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలులో సకల సౌకర్యాలు పొందేందుకు రు.25కోట్లు ఖర్చు చేసినట్లు ఏసీబీ ధ్రువీకరించిందని, ఈ విషయమై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి కంటే అతి పెద్ద కుంభకోణంలో కూరుకుపోయిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా చంచల్‌గూడ జైలులో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్న గాలిజనార్దన్‌రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.