గాలి బెయిల్‌ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్‌ కోసం యాదగిరి మే 2, 3 తేదిల్లో పదే పదే ఫోన్లు చేశారని, మే6న బెయిల్‌కు సంబందించి యాదగిరిరావుతో మాట్లాడినట్లు చెప్పారు. మే 6న ఉదయం 11.1. గంటలకు రూ.3కోట్లు అడిగామని, తర్వాత రూ.5కోట్లు ఇవ్వమన్నామని వివరాలు పట్టాభికి చెప్పినట్లు చెప్పారు. 2011డిసెంబర్‌ మొదటి వారంలో సర్వేశ్వరరెడ్డి బెయిల్‌ కోసం యాదగిరి తనను కలిసినట్లు చలపతిరావు వివరించారు. ఏసీబీ కోర్టులో ఉన్నప్పుడు ఓఎస్డీ సర్వేశ్వర్‌రెడ్డి బెయిల్‌ కోసం పట్టాభి రూ.10లక్షలు తీసుకున్నట్లు వెల్లడించారు. సర్వేశ్వర్‌రెడ్డికి బెయిల్‌ వచ్చినందుకు తనకు రూ. లక్ష అందినట్లు చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు.