గిన్నిస్‌రికార్డుల కెక్కిన జాతీయ గీతం

కృష్ణలంక:మన దేశ జాతీయ గీతమైన ‘జనగణమన’పాటను ఒకేసారి లక్షన్నర మందికలిసి ఆరుసార్లు ఆలపించటం ద్వారా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లో చోటు చేసుకుంది.కార్యక్రమంలో నగరంలోని మాంటిసోరి కళాశాల ఆవరణలో జరిగింది.లయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 320 పాఠశాలలోని 1,50,000 మంది కలిసి ఒకేసారి జపనగణమన పాటను ఆలపించారు.సందర్భంగా గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 405832 నెంబరు ద్వారా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించామని తెలిపారు.ప్రతి విద్యార్థి ప్రతిరోజు జాతీయ గీతాన్ని పాఠశాల నుంచి వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఆలపించాలని పకోరారు.మాతృభాషను,కన్నతల్లిని ఒకేలా పరిరక్షించుకోవాలన్నారు.రవీంద్రనాథ్‌టాగూర్‌ రాసిన జనగణమనకు 60 ఏళ్ళు నిండిన సందర్భంగా మనదేశం మనగీతం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించామని పాల్గొన్న కృతజ్ఞతలు తెలిపారు.సెంట్రల్‌ ఎమ్మెల్లే మల్లాదివిష్ణు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలని చెప్పారు.ఇంతమంది కలిసి ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించటం ఆనందంగా ఉందన్నారు క్లబ్‌ గవర్నర్‌ కంకణాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.పారిశ్రామికవేత్త  కోంగటి సత్యనారయణ,మాంటిసొరి విద్యాసంస్థల ఆధినేత సుధాకర్‌రెడ్డి,చౌదరి మిర్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ళ