గిన్నీస్‌బుక్‌ రికార్డులో ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు

తిరుపతి: తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్‌ కళాశా విద్యార్థులు గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం పొందారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించిన విండోస్‌ యావ్‌ఫెస్ట్‌ మారథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు తయారుచేసిన 75 కంప్యూటర్‌ అప్లికేషన్లకు గిన్నీస్‌బుక్‌లో స్థానం లభించడం ద్వారా విద్యార్థులు ఈ ఘనతీ సాధించారు. ఈ సందర్భంగా ఆ కళాశాలలో సోమవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలకు చెందిన 75 మంది విద్యార్థులు 18 గంటల్లో 75 విండోస్‌-8 అప్లికేషన్లు అభివృద్ధిపరచడం ద్వారా గిన్నీస్‌బుక్‌లో స్థాణం పొందారన్నారు.