గుంటూరులో మాజీ జడ్పీటీసీ హత్య
గుంటూరు:ఏడు రోజుల క్రితం అదృశ్యమైన జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు కొలగాని ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు.అతని మృతదేహన్ని రేపల్లే మండలం మారుతోట వద్ద పోలీసులు ఈ ఉదయం గుర్తించారు.డబ్బు నగల కోసం మరో వ్యక్తితో కలిసి ఆయన కారు డ్రైవర్ ఈ ఘతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ప్రసాద్‌ను హత్యచేసి మారుతోటలో పూడ్చిపెట్టాడు.ఈ నెల 7నుంచి ప్రసాద్ కనిపించడం లేదంటూ ఆయన భార్య పద్మజ 10న తందోల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఈరోజు అతని మృతదేహన్ని గుర్తించారు.